ఇంగ్లండ్ (England) లో పుట్టి అక్కడ విజయవంతమైన పొట్టి క్రికెట్ (T20 Cricket) కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది నిస్సందేహంగా ఐపీఎల్ (IPL) అనేది ఎవ్వరూ కాదనలేని అంశం. క్రికెట్లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్లో భారత్ (India) అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ (BCCI) రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఇదే.
పీఎస్ఎల్తో ఐపీఎల్‌ను పోల్చకండి.. పీఎస్ఎల్ 2016లో ఆరంభమైతే, ఐపీఎల్ 2008లోనే మొదలైంది.. పీఎస్ఎల్, ఐపీఎల్ కంటే వేగంగా పాపులారిటీ దక్కించుకుంది. ఐపీఎల్ పుట్టినప్పుడు మార్కెట్లో పోటీగా మరో లీగ్ లేదు.. అంటూ ఫిరోజ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ఊతప్ప స్పందిస్తూ.. నువ్వు అంటున్న ఆ మార్కెట్‌ని క్రియేట్ చేసిందే ఐపీఎల్.. అంటూ గట్టిగా కౌంటరిచ్చాడు.