ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్ (Punjab KIngs)తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఈ ఘనతను సాధించాడు. పంజాబ్ ఇన్నింగ్స్ లో 20వ ఓవర్ వేయడానికి వచ్చిన అతడు 0 W 0 W W W ప్రదర్శన చేశాడు. 20వ ఓవర్ ను మెయిడీన్ చేయడంతో పాటు మూడు వికెట్లు సాధించాడు. ఆఖరి బంతికి రనౌట్ కావడంతో ఆ వికెట్ ఉమ్రాన్ ఖాతాలో చేరలేదు.
[caption id="attachment_1272400" align="alignnone" width="1600"] ఐపీఎల్ చరిత్రలో ఆఖరి ఓవర్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఉమ్రాన్ మాలిక్ చరిత్రకెక్కాడు. 2017 ఐపీఎల్ లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ సన్ రైజర్స్ పై ఇటువంటి ప్రదర్శననే నమోదు చేశాడు.