కరోనా కారణంగా రెండేళ్లుగా ఐపీఎల్ కళతప్పింది. ప్రేక్షకులు లేకుండా యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహించారు. ఈసారైనా గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తే.. ఒమిక్రాన్ రూపంలో మళ్లీ పెద్ద సమస్యే వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
గత సీజన్‌ను మొదట ఇండియాలోనే నిర్వహిచారు. కానీ పలు నగరాల మధ్య తిరగడం వల్ల పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడడంతో.. మే 4న టోర్నీకి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత సెప్టెంబరు నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లను తిరిగి కొనసాగించారు. ఈ సారి ఈ పరిస్థితి రాకుండా అన్ని మ్యాచ్‌లను ఒకే చోట పెట్టనున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)