ఇక, ఈ సీజన్ లో 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీయడం ద్వారా.. సౌతాఫ్రికా టీ20 సిరీస్ కు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. తన స్ఫీడుతో ఈ సీజన్ లో ఎన్నో రికార్డుల్ని అవలీలగా బద్దలు కొడుతున్నాడు. లూకీ ఫెర్గ్యూసన్, అన్రిచ్ నోకియా, రబాడా, బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు వేయలేని స్పీడు కూడా ఈ కుర్రాడు వేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ప్రతిభ గల మరో కుర్రాడిని ప్రపంచం ముందు నిలబెట్టింది. దేశవాళి టోర్నీలు అయిన రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే లాంటి వాటిలో టన్నుల కొద్ది పరుగులు సాధించినా రాని గుర్తింపు... ఐపీఎల్ తో వచ్చేసింది. అతడే.. మన హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ (Tilak Varma).రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట అతడే ఒక సైన్యంలా చెలరేగుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్ లో ఎక్కువ పరుగులు చేసింది మనోడే.
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ కూడా తన బౌలింగ్ తో ఫిదా చేశాడు. డెత్ ఓవర్లలో మొహ్సిన్ బౌలింగ్‌కు దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహ్సిన్ 2017-18 విజయ్ హజారే ట్రోఫీ నుండి లిస్ట్ ఎ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 23 ఏళ్ల మొహ్సిన్ ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.