[caption id="attachment_1267926" align="alignnone" width="1600"] సగం సీజన్ పూర్తయ్యే సరికి అత్యధి వికెట్ల జాబితాలో కుల్చా (కుల్దీప్ యాదవ్, చహల్) ద్వయమే తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆడిన 8 మ్యాచ్ ల్లో 18 వికెట్లు తీసిన చహల్ పర్పుల్ క్యాప్ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉండగా.. 8 మ్యాచ్ ల్లో 17 వికెట్లతో కుల్దీప్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు.
గత సీజన్ లో కేకేఆర్ తరఫున పెద్దగా ఆడే అవకాశం రాని కుల్దీప్ యాదవ్ ను ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతం చేసుకుంది. కొత్త జట్టు తరఫున కుల్దీప్ యాదవ్ అదరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఇక పాత జట్టు కేకేఆర్ తో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ అద్బుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు తీశాడు. (IPL Twitter)
[caption id="attachment_1279600" align="alignnone" width="1600"] వీరితో పాటు పర్పుల్ క్యాప్ రేసులో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) బౌలర్లు కూడా ఉన్నారు. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తూ ప్రత్యర్థులకు ఊపిరి ఆడకుండా చేస్తోన్న నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్(Umran Malik).. 8 మ్యాచ్ ల్లో 15 వికెట్లు తీశాడు. ఇక అతడి సహచరుడు టి. నటరాజన్ (Natarajan) కూడా 8 మ్యాచ్ ల్లో 15 వికెట్లు తీసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.
ఈ నలుగురితో పాటు కేకేఆర్ పేసర్ ఉమేశ్ యాదవ్ (Umesh Yadav), చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డ్వేన్ బ్రావోలు కూడా పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్నారు. ఆరెంజ్ క్యాప్ మాదిరి కాకుండా ఇందులో బౌలర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. అందుకే ఎవరికి పర్పుల్ క్యాప్ దక్కుతుందో చెప్పడం కష్టంగా ఉంది. అయితే ఫామ్ ను బట్టి చూస్తే.. ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, కుల్చా ద్వయం మధ్య పర్పుల్ క్యాప్ కోసం తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.