బ్యాటింగ్ : రవీంద్ర జడేజా తన దూకుడు బ్యాటింగ్ తో చెన్నైకు ఎన్నో సూపర్ విజయాలు అందించాడు. రంజీల్లో అతనికి రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు వన్డే, టీ20ల్లో పరిస్థితిని బట్టి గేరు మార్చడంలో దిట్ట. అంతర్జాతీయ టీ20లో అతని స్ట్రైక్ రేట్ 125. అదే సమయంలో, ఐపీఎల్లో 128 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.
బౌలింగ్: జడేజా తన ఓవర్లను త్వరగా పూర్తి చేసే సామర్ధ్యం ఉన్న బౌలర్. టెస్టు క్రికెట్లో 242, వన్డేల్లో 188, టీ20ల్లో 48 వికెట్లు తీశాడు. అదే సమయంలో, 200 ఐపీఎల్ మ్యాచ్‌లలో 127 వికెట్లు తీశాడు. వికెట్లు తీయడమే కాకుండా విదేశీ పిచ్‌లపై కూడా సమర్థంగా రాణించగలడం జడేజా ప్రత్యేకత. అదే సమయంలో, టీమిండియా పిచ్ లపై డేంజరస్ బౌలర్.
ఫీల్డింగ్ : యువరాజ్ సింగ్ లాగానే రవీంద్ర జడేజా కూడా అద్భుతమైన ఫీల్డర్. జడేజా ఏ స్థానంలోనైనా ఫీల్డింగ్ చేయగలడు. టీ20 క్రికెట్లో 100కి పైగా క్యాచ్‌లు పట్టిన క్రికెటర్లలో జడేజా ఒకడు. జడేజా 276 టీ20 మ్యాచుల్లో 107 క్యాచ్‌లు అందుకున్నాడు. అలాగే, ప్రస్తుత జనరేషన్ లో జడేజా అత్యుత్తమ ఫీల్డర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇప్పటివరకు సీఎస్కే జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా మాత్రమే కెప్టెన్లుగా ఉన్నారు. వారిద్దరూ భారత ఆటగాళ్లు. చెన్నైలో మొయిన్ అలీ మరియు డ్వేన్ బ్రావో వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే ఫ్రాంచైజీ భారత ఆటగాడిపై నమ్మకముంచింది. జడేజా వయసు 33 ఏళ్లు మాత్రమే. అలీ-బ్రావో కంటే చిన్నవాడు. ఇటువంటి పరిస్థితుల్లో జడేజా రాబోయే కొన్నేళ్ల పాటు సులభంగా కెప్టెన్‌గా ఉండగలడు.
ఈ కారణాలతో పాటు, జడేజా మొత్తం సీజన్‌కు అందుబాటులో ఉండగలడు. టీమిండియాలో కీ ప్లేయర్... అలాగే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ఉంది. బీసీసీఐ ఒప్పందం ప్రకారం భారత ఆటగాళ్లు ఐపీఎల్లో మరే ఇతర టీ20 లీగ్‌లో ఆడలేరు. అదే, విదేశీ క్రికెటర్లు చాలా లీగులు ఆడతారు. జడేజా ఐపీఎల్లో ఇప్పటివరకు రూ.93 కోట్లు సంపాదించాడు. దీంతోపాటు ప్రకటనలు, బీసీసీఐ కాంట్రాక్టుల ద్వారా కోట్లాది రూపాయలు వెనకేస్తున్నాడు.