ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్, క్రికెట్ న్యూస్, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, కేన్ విలియమ్సన్, ఐపీఎల్ టుడే మ్యాచ్ అప్ డేట్స్, డేవిడ్ వార్నర్ రికార్డులు" width="1600" height="1608" /> David Warnerఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ (David Warner) తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ () అభిమానులకు వార్నర్ అంటే విపరీతమైన గౌరవం. అయితే వార్నర్ ఐపీఎల్ తొలి నాళ్లలో చాలా బ్యాడ్ బాయ్ అంట. ఈ విషయాన్ని వార్నర్ మాజీ జట్టు సభ్యుడు పేర్కొనడం విశేషం.
వీరేంద్ర సెహ్వాగ్ ఇండియన్ క్రికెట్ లో ఓ సంచలనం. తొలి బంతి నుంచే ప్రత్యర్థులపై చెలరేగడం సెహ్వాగ్ కే చెల్లింది. ఐపీఎల్ లో సెహ్వాగ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ (Delhi Dare Devils), కింగ్స్ (Punjab Kings) జట్లకు ఆడాడు. తాజాగా అతడు స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ బజ్ తో మాట్లాడుతూ వార్నర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్ ల్లో తరచూ ఇతర ప్లేయర్స్ తో గొడవ పడి జట్టుకు తలనొప్పులు తీసుకువచ్చే వాడని తెలిపాడు. ’వార్నర్ తొలి సీజన్ లో చాలా దారుణంగా ప్రవర్తించేవాడు. ప్రాక్టీస్ కంటే కూడా పార్టీలు ముఖ్యమని నమ్మేవాడు. తరచూ ఎవరో ఒకరితో గొడవకు దిగే వాడు. దాంతో అతడికి గుణపాఠం నేర్పించాలని నేను ఇంకా టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకున్నాం. దాంతో అతడిని ఢిల్లీకి ఇంకో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే అతడి దేశానికి పంపించేశాం‘ అని సెహ్వాగ్ 2009 ఘటనలను వివరించాడు.
ఇక 2018 ఆగస్టులో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో వార్నర్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్ లో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్ మరో ప్లేయర్ బెన్ క్రాఫ్ట్ లు కలిసి బాల్ ట్యాంపరింగ్ చేశారు. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్, స్మిత్ లపై ఏడాది పాటు నిషేధం విధించింది. ( PC : Twitter)