అయితే గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆఖరి బంతికి ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఇప్పటి వరకు హైదరాబాద్ సీజన్ లో ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ ల్లో గెలిచి నాలుగు మ్యాచ్ ల్లో ఓడింది. ఫలితంగా 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.
ఇదే విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ స్పష్టం చేశారు. ’మళ్లీ సుందర్ చేతికి గాయమైంది. ప్రస్తుతం అతడు బౌలింగ్ చేసే స్థితిలో లేడు. మా తదపరి మ్యాచ్కు అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ అతడు దూరమైతే.. అది మా జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అతడు మా జట్టులో కీలక బౌలర్లలో ఒకడని" టామ్ మూడీ పేర్కొన్నాడు.