ఈ క్రమంలోనే అతను సులువుగా రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పలికే చాన్సుంది. అయితే సన్రైజర్స్ దీపక్ కోసం రూ.10 కోట్లు చెల్లించేందుకైనా రెడీగా ఉందని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. 2016లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్.. 63 మ్యాచ్ల్లో 7.80 ఎకానమీతో 59 వికెట్లు తీసాడు. ఇందులో రెండు సార్లు 4 వికెట్ల ఘనతను రెండు సార్లు అందుకున్నాడు.