గత నాలుగు, ఐదు సీజన్లుగా ఇండియా స్టార్ ఆటగాళ్లు లేక ఫారినర్స్పై పూర్తిగా ఆధారపడిన హైదరాబాద్.. ఈ సారి ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని భావిస్తుంది. ఫారినర్స్తో పాటు దేశీయ ఆటగాళ్లను తీసుకోవాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు తేజం, టీమిండియా వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడిని వేలంలో తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన అంబటి రాయుడికి ధనాధన్ లీగ్లో మెరుగైన రికార్డు ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్లో సత్తా చాటే బ్యాటర్ అతను. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని వదులుకోగా.. రూ. 2 కోట్ల కనీస ధరతో రాయుడు వేలానికి అందుబాటులోకి వచ్చాడు. మంచి అనుభవం ఉన్న రాయుడు జట్టులో ఉంటే బాగుంటుందని సన్రైజర్స్ యాజమాన్యం భావిస్తోందని ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి తెలిపాడు.