సన్ రైజర్స్ తరఫున 76 మ్యాచ్ లు ఆడిన అతడు 93 వికెట్లు తీశాడు. ఇక ఈ సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ కు వెళ్లిన అతడు.. 7 మ్యాచ్ ల్లో 8 వికెట్లు తీశాడు. తద్వారా 100 వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు. డ్వేన్ బ్రావో (179), లసిత్ మలింగ (170), సునీల్ నరైన్ (149) తర్వాత 100 వికెట్లు తీసిన నాలుగో విదేశీ ప్లేయర్గా రషీద్ రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం ఇతడి ఖాతాలో 101 వికెట్లు ఉన్నాయి.
అంతేకాకుండా రషీద్ ఖాన్ లేకున్నా కూడా తాము వరుస విజయాలు సాధిస్తున్నట్లు కాస్త అతి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ’అందరూ అనుకున్నట్లు రషీద్ ఖాన్ అంత గొప్ప వికెట్ టేకర్ బౌలర్ ఏమీ కాదు. అతడు వికెట్లు తీయలేడు. అతడు లేకున్నా సన్ రైజర్స్ కు నష్టం లేదు‘ అంటూ కామెంట్స్ చేశాడు. అయితే అతడి ఎకానమీ మాత్రం గొప్పగా ఉందంటూ కితాబిచ్చాడు. ఐపీఎల్ లో 6.35 ఎకానమీ అంటే మాటలు కాదని లారా పేర్కొన్నాడు.