[caption id="attachment_1263230" align="alignnone" width="1600"] శుబ్ మన్ గిల్ 1999 సెప్టెంబర్ 8న లక్వీందర్ సింగ్, కీర్త్ గిల్ దంపతులకు తొలి సంతానంగా జన్మించాడు. గిల్ చిన్నతనంలో వాళ్ల నాన్న ఆడుకోవడానికి ఎన్ని బొమ్మలు కొని తెచ్చినా వాటితో ఆడుకునే వాడు కాదంట. కేవలం క్రికెట్ బ్యాట్ తోనే ఆడుకునే వాడంట.
[caption id="attachment_1109384" align="alignnone" width="576"] గిల్ కు క్రికెట్ అంటే ఇష్టమని గ్రహించిన లక్వీందర్ తన కొడుకును క్రికెటర్ ను చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకు కారణం కూడా లేకపోలేదు. లక్వీందర్ కు కూడా చిన్నతనంలో క్రికెటర్ అవ్వాలనే కోరిక ఉండేది. అయితే అతడి కుటుంబ పరిస్థితుల వల్ల లక్వీందర్ క్రికెట్ కాలేకపోయాడు.
[caption id="attachment_1100418" align="alignnone" width="1000"] ఇక పంజాబ్ లో జరిగిన అంతర్ జిల్లా అండర్ 16 టోర్నమెంట్ అయిన ఎంఎల్ మర్కన్ ట్రోఫీలో గిల్ చెలరేగిపోయాడు. 351 పరుగులతో అందరి చూపు తనపై పడేలా చేసుకున్నాడు. ఇక అదే సమయంలో నిర్మల్ సింగ్ తో కలిసి 587 పరుగులతో ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇది ఇప్పటికీ ప్రపంచ రికార్డు గా ఉండటం విశేషం.
2018లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ శుబ్ మన్ గిల్ ఎంపికయ్యాడు. ఫైనల్ మినహా ప్రతి మ్యాచ్ లోనూ గిల్ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇక పాకిస్తాన్ పై ఆడిన 102 పరుగుల ఇన్నింగ్స్ అతడిలోని టాలెంట్ ను బయటపెట్టింది. ఈ ఇన్నింగ్స్ పై బీసీసీఐ బాస్ గంగూలీ సైతం ప్రశంసలు కురిపించాడు. ( Shubman gill/ Twitter )
[caption id="attachment_1084028" align="alignnone" width="1200"] గిల్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా యూత్ వన్డే సిరీస్ అని చెప్పుకోవచ్చు... అందులో అతడు 100 సగటుతో పరుగులు సాధించాడు. 16 మ్యాచ్ ల్లో 15 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం రాగా... గిల్ 1,149 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. యావరేజ్ 104.45 కాగా... స్ట్రయిక్ రేట్ 160గా నమోదు చేశాడు. ఈ యావరేజ్ విషయంలో సర్ డాన్ బ్రాడ్ మన్ 99.9 ను కూడా గిల్ దాటడం విశేషం. అయితే బ్రాడ్ మన్ అంతర్జాతీయ టెస్టుల్లో నెలకొల్పాడు. కానీ, గిల్ మాత్రం అంతర్జాతీయ హోదా లేని మ్యాచ్ ల్లో నెలకొల్పాడు. దాంతో టీమిండియా టెస్టు జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది.