తొలి 6 ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. అంటే కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ ఆవల ఉంటారు. దాంతో ఓపెనర్ల ఆరంభ ఓవర్లలో చెలరేగుతూ ఉంటారు. కానీ ఇక్కడ విలియమ్సన్ మాత్రం అందుకు విరుద్దంగా ఆడుతున్నాడు. టెస్టు తరహా ఆటతీరుతో పరుగులు సాధిస్తున్నాడు. దాంతో తొలి ఆరు ఓవర్లలో సన్ రైజర్స్ చాలా తక్కువ పరుగులను మాత్రమే సాధిస్తోంది.
ఉదాహరణకు కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో విలియమ్సన్ ఆటను చూస్తే.. 17 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో పవర్ ప్లేలో సన్ రైజర్స్ అనుకన్నంత స్థాయిలో పరుగులు చేయలేకపోయింది. ఫలితంగా చివర్లో సన్ రైజర్స్ చేయాల్సిన పరుగులు ఎక్కువ అవుతున్నాయి. ఫలితంగా తర్వాత వచ్చే బ్యాటర్స్ పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. వారు భారీ షాట్లకు వెళ్లి అవుటవుతున్నారు.