’వైలెన్స్.. వెైలెన్స్.. వైలెన్స్ ఐ డోంట్ లైక్ ఇట్.. ఐ అవాయిడ్ ఇట్.. బట్ వైలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్ ఇట్..‘ ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోన్నKGF 2 సినిమాలో రాకీ భాయ్ చెప్పే డైలాగ్ ఇది. ఇదే డైలాగ్ ను ’రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్ ఐ డోంట్ లైక్ ఇట్.. ఐ అవాయిడ్ ఇట్.. బట్ రికార్డ్స్ లైక్స్ మీ ఐ కాంట్ అవాయిడ్..‘ కాస్త మార్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) థండర్ బోల్ట్ ఉమ్రాన్ మాలిక్.
గతేడాది కేవలం మూడు మ్యాచ్ లను మాత్రమే ఆడిన ఉమ్రాన్ మాలిక్.. తనలోని పేస్ ను అందరికీ తెలిసేలా చేశాడు. దాంతో 2022 సీజన్ కోసం హైదరాబాద్ జట్టు ఇతడిని మళ్లీ రీటెయిన్ చేసుకుంది. అనుకున్నట్లే సీజన్ లో ఉమ్రాన్ అద్బుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటికే ఆడిన 10 మ్యాచ్ ల్లో 15 వికెట్లు తీసి ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా ఉన్నాడు.
అయితే ఈ సీజన్ లో ఉమ్రాన్ మాలిక్ దూకుడును చూస్తుంటే.. త్వరలోనే షాన్ టైట్ రికార్డును బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు. ఇక క్రికెట్ చరిత్రలో అత్యధిక వేగవంతమైన బాల్ వేసిన బౌలర్ గా పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ ఉన్నాడు. 2022లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో అతడు 161 కి.మీ వేగంతో బాల్ వేశాడు. ఈ రికార్డును కూడా ఉమ్రాన్ మాలిక్ తొందరలోనే బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు.