IPL 2022 SHIKHAR DHAWAN FOURS RECORD SHIKAR DHAWAN BECOME FIRST INDIAN PLAYER TO HIT 1000 FOURS IN T20 FORMAT SJN
IPL 2022: రోహిత్, కోహ్లీలను కాదని ధావన్ ఖాతాలో చేరిన ఆ రికార్డు... తొలి భారత ప్లేయర్ గా గబ్బర్ కొత్త చరిత్ర
IPL 2022: టి20 ఫార్మాట్ లో శిఖర్ ధావన్ కొత్త చరిత్ర నెలకొల్పాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వల్ల కాని పనిని తాను చేసి చూపించాడు.
గుజరాత్ టైటాన్స్ (Gujarath Titans)తో జరిగిన మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కొత్త చరిత్ర సృష్టించాడు. టి20 ఫార్మాట్ లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
2/ 6
శుక్రవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరంకాగా వరుసగా రెండు సిక్సర్లు బాదిన రాహుల్ తెవాటియా గుజరాత్ టైటాన్స్ కు అద్భుత విజయాన్ని అందించాడు.
3/ 6
అయితే ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. టి20 ఫార్మాట్ లో 1000 ఫోర్లు బాదిన తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు. ఓవరాల్ గా ఐదో ప్లేయర్ గా నిలిచాడు.
4/ 6
టి20 ఫార్మాట్ లో అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్ల జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 1,132 ఫోర్లతో ముందున్నాడు. అతడి తర్వాత అలెక్స్ హేల్స్ 1,054 ఫోర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
5/ 6
ఇక మూడో స్థానంలో డేవిడ్ వార్నర్ 1005 ఫోర్లతో ఉండగా... అరోన్ ఫించ్ 1004 ఫోర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. తాజాగా శిఖర్ ధావన్ 1000 ఫోర్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
6/ 6
ఇక భారత ఆటగాళ్ల విషయానికి వస్తే ధావన్ తర్వాత విరాట్ కోహ్లీ (917) ఫోర్లతో రెండో ప్లేస్లో, రోహిత్ శర్మ (875)ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నారు.