అయినప్పటికీ ముంబై ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే నెగ్గి మిగిలిన 11 మ్యాచ్ ల్లో ఘోరంగా ఓడింది. ఫలితంగా 8 పాయింట్లతో లీగ్ లో ఆఖరి స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కూడా 8 పాయింట్లతో ఐపీఎల్ ను ముగించినా.. నెట్ రన్ రేట్ విషయంలో ముంబై కంటే మెరుగ్గా ఉండటంతో 9వ స్థానంలో నిలిచింది. ( IPL Twitter)
ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో అర్జున్ టెండూల్కర్ ను రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ మరోసారి కొనుగోలు చేసింది. ఇక సీజన్ లో ముంబై ఆటతీరు పేలవంగా సాగగా.. తుది జట్టు విషయంలో ముంబై మ్యాచ్ మ్యాచ్ కు మార్పులు చేసింది. ఇక ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న తర్వాత బెంచ్ ను పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రోహిత్ శర్మ ప్రకటించాడు.
దాంతో ఢిల్లీ తో జరిగే మ్యాచ్ లో అర్జున్ ఎంట్రీ ఖాయం అని అంతా అనుకున్నారు. ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ ఖాతాలో కూడా అర్జున్ టెండూల్కర్ యార్కర్లను ప్రాక్టీస్ చేయడాన్ని పోస్ట్ చేయడంతో.. మరోసారి టెండూల్కర్ ఆటను చూడగలం అని అంతా భావించారు. ఇక సోదరి సారా టెండూల్కర్ కూడా మరోసారి మైదానంలో ప్రత్యక్షమైంది.