క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రేపు తన 49వ పుట్టిన రోజును జరుపుకోనున్న సంగతి తెలిసిందే. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్ టెండూల్కర్ 16 ఏట అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి అతడు దాదాపు 24 ఏళ్ల పాటు క్రికెట్ ను మకుటం లేని మహరాజులా ఏలిన సంగతి తెలిసిందే.
వికెట్ కీపర్ గా 1999లో క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ప్రసాద్.. 6 టెస్టులు 17 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 106 పరుగులు చేసిన అతడు.. వన్డేల్లో 131 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్ లో దారుణంగా విఫలమవ్వడంతో అతడి కెరీర్ అక్కడితోనే ముగిసిపోయింది. ఇక 2106లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా ఎంపికైన అతడు 2020 వరకు కొనసాగాడు. ఆటగాడి కంటే కూడా సెలక్టర్ గా ఇతడిని తెలుగు వారు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు.
ఆస్ట్రేలియా మాజీ టెన్నిస్ ప్లేయర్ యాష్టే బార్టీ కూడా ఏప్రిల్ 24న జన్మించడం విశేషం. తొలుత క్రికెటర్ గా జర్నీని మొదలు పెట్టిన బార్టీ అనంతరం రాకెట్ పట్టి టెన్నిస్ ప్లేయర్ అయ్యింది. తన కెరీర్ లో 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆమె మహిళల ప్రపంచ నంబర్ వన్ కిరీటాన్ని కూడా అందుకుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా 26 ఏళ్ల వయసులో ఆమె టెన్నిస్ ఆటకు గుడ్ బై చెప్పి అందరికీ షాకిచ్చింది. (PC: TWITTER)