చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో రాజస్థాన్ అదరగొట్టింది. 151 పరుగుల లక్ష్యాన్ని ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ విజయంతో 18 పాయింట్లతో సెకండ్ ప్లేసుకి దూసుకెళ్లింది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ సాధారణ లక్ష్యాన్ని మాత్రమే సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసింది. మొయిన్ అలీ (57 బంతుల్లో 93 పరుగులు ; 13 ఫోర్లు, 3 వికెట్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఇన్నింగ్స్‌తో మొయిన్ అలీ సీఎస్కే తరఫున ఓ అరుదైన రికార్డు సాధించాడు.
ఈ మ్యాచులో పవర్ ప్లే లో మొయిన్ అలీ అల్లకల్లోలం చేశాడు. ఎడాపెడా సిక్సులు, ఫోర్లు బాదుతూ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అశ్విన్, బౌల్ట్ బౌలింగ్‌లో పిచ్చికొట్టుడు కొట్టాడు. దీంతో పవర్ ప్లేలో సీఎస్కే 1వికెట్ నష్టపోయి 75పరుగులు పిండుకుంది. ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగుల రికార్డును సీఎస్కే సాధించింది.
ఇక.. పవర్ ప్లే ఆఖరి ఆరో ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌కు దిగాడు. అతని బౌలింగ్‌ను మొయిన్ చీల్చి చెండాడాడు. ఆ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టిన అలీ తర్వాత వరుసగా 5బంతుల్లో 5 వైవిధ్యమైన ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును రంకెలేయించాడు. ఆ ఓవర్లో 6,4,4,4,4,4తో ఏకంగా మొయిన్ అలీ ఏకంగా 26పరుగులు పిండుకున్నాడు.