ఇక, ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం (మే 25) ఆఖరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌లో గెలుపు వాకిట బొక్కాబోర్లా పడిన లక్నో.. 15వ సీజన్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గెలిచిన బెంగళూరు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ఇప్పుడు, పాయింట్ల పట్టికలో రెండో ర్యాంక్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మరియు మొదటి ర్యాంక్ గుజరాత్ టైటాన్స్‌లను అధిగమించి కప్ గెలవాల్సి ఉంది. అయితే.. ఫ్యాన్స్ మాత్రం ఈ సారి కప్ ఆర్సీబీదే అంటున్నారు. ఇందుకు కారణం 'లక్కీ చార్మ్' ఉన్న ప్లేయర్ జట్టులో ఉండటమే.
RCB విజయం వారి జట్టులోని సీనియర్ ప్లేయర్స్ వల్ల మాత్రమే దక్కదు. ఇంతకు ముందు కూడా RCBలో వెటరన్ ఆటగాళ్లు ఉన్నారు. టైటిల్ కోసం బరిలోకి దిగిన రాజస్థాన్, గుజరాత్లో కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ల ప్రదర్శన బలంతోనే వారు RCB కంటే ఎక్కువ పాయింట్లతో ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించారు. అయితే.. ఆ 'లక్కీ చార్మ్' ప్లేయర్ వల్ల ఆర్సీబీ దే కప్ అంటున్నారు ఫ్యాన్స్. ఆ లక్కీ చార్మ్ ప్లేయర్ ఎవరో కాదు లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ.
ఇప్పుడు కర్ణ్ శర్మ ఆర్సీబీ జట్టుతో ఉన్నారు. అందుకే ఈ ‘లక్కీ ఛార్మ్’ ప్లేయర్ వల్ల ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న విరాట్ కోహ్లి కల సాకారం అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే గత మూడు మ్యాచుల నుంచి ఆర్సీబీ వెంట అదృష్టం ఉంది. క్యాచులు మిస్సవ్వడం, రివ్యూలు అనుకూలంగా రావడం ఇలా అన్ని ఆర్సీబీనే ఈ సారి విజేత అనేలా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్.