హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అన్నింట్లోనూ క్లీన్ స్వీప్ మంత్రాన్ని జపిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే... తాను సారథ్యం చేస్తుంటే సిరీస్ క్లీన్ స్వీప్ కావాల్సిందే అనే ధోరణిలో రోహిత్ ఉన్నాడు.
[caption id="attachment_847410" align="alignnone" width="1050"] రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ (అంతర్జాతీయం, లీగ్ క్రికెట్ లను కలుపుకుని)లో 10 వేల పరుగుల మైలురాయికి కేవలం 64 పరుగుల దూరంలో నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకు తన లో 371 మ్యాచ్ ల్లో 9,936 పరుగులు చేశాడు. నేటి మ్యాచ్ లో మరో 64 పరుగులు చేస్తే 10వేల మైలురాయిని అందుకుంటాడు.
ఇదే జరిగితే భారత్ నుంచి టి20 ఫార్మాట్ లో 10వేల మైలురాయిని అందుకున్న రెండో ప్లేయర్ గా రోహిత్ నిలుస్తాడు. విరాట్ కోహ్లీ (10,326) ఈ జాబితాలో ముందున్నాడు. ఓవరాల్ గా 10వేల మార్కును అందుకున్న ఏడో క్రికెటర్ గా మారతాడు. ఈ ఘనతను ఇప్పటికే క్రిస్ గేల్, షోయబ్ మాలిక్ (పాకిస్తాన్), పొలార్డ్, ఫించ్, విరాట్ కోహ్లీ, వార్నర్ లు అందుకున్నారు.