ఐదుసార్లు ఐపీఎల్ (IPL) చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ఈ సీజన్ లో ఒక్కటి కూడా కలిసి రావడం లేదు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఆడేది చాంపియన్ జట్టేనా అనే అనుమానం ముంబై అభిమానుల్లో కలుగుతోంది. కోట్లు పోసి తెచ్చిన ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు. ఒకరు ఇద్దరు తప్ప ఈ సీజన్ లో ముంబై ఇప్పటి వరకు సమష్టి ప్రదర్శన చేయలేకపోయింది.
ఇక రోహిత్ శర్మ (Rohit Sharma) ఆట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో జరిగిన తొలి మ్యాచ్ లో 41 పరుగులు చేసిన రోహిత్.. ఆ తర్వాతి మ్యాచ్ ల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 10, 3, 26, 28, 6 ప్రదర్శనతో అటు టీమిండియా ఇటు ముంబై అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాడు.
[caption id="attachment_175966" align="alignnone" width="875"] అయితే తాజాగా రోహిత్ లక్నోతో జరిగిన మ్యాచ్ లో మరోసారి సింగిల్ డిజిట్ కే అవుటవ్వడంతో ఆ చెత్త రికార్డు హిట్ మ్యాన్ ఖాతాలో చేరింది. ప్రస్తుతానికి అయితే రోహిత్ 61 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగి తొలి స్థానంలో ఉన్నాడు.