IPL 2022 Retentions: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాకిచ్చిన రషీద్ ఖాన్? బేరం కుదరక రిటైన్ చేయని ఎస్ఆర్‌హెచ్?

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ షాక్ ఇచ్చాడు. ఎస్ఆర్‌హెచ్ ఆఫర్ చేసిన ధర తనకు సరిపోదని చెబుతూ జట్టును వీడటానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అతను త్వరలో కొత్త జట్టులోకి వెళ్లే అవకాశం ఉన్నది.