అదే సమయంలో ఎటువంటి అంచనాలు లేకుండా.. వీడు కెప్టెనా అనే వాదనతో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అందరి అంచనాలను పటా పంచలు చేశాడు. అటు బ్యాట్ తో రాణిస్తూ ఇటు కెప్టెన్ గా రాణిస్తూ గుజరాత్ టైటాన్స్ ను ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ టీం ఉండటం విశేషం.