ఐపీఎల్ 2022(IPL 2022) చివరి ఘట్టానికి చేరుకుంది. 74 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైనల్ (IPL 2022 Final) కి రంగం సిద్ధమైంది. 10 ఫ్రాంఛైజీలు పోటీపడిన ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) టగ్ ఆఫ్ వార్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయ్. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) జట్లు రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. (Instagram)
ఇక, ఐపీఎల్-15లో అత్యధిక పరుగుల వీరుడు జోస్ బట్లర్ (Jos Buttler) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే నాలుగు సెంచరీలతో టోర్నమెంట్లో తన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఇప్పటివరకు 16గేమ్‌లలో 58.85సగటుతో 824పరుగులు చేసిన బట్లర్ నిన్నటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఒంటి చేత్తో రాజస్థాన్‌ను గెలిపించి ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. (Instagram)
వాన్ డెర్ డస్సేన్కు ఐపీఎల్ 2022లో ఎక్కువ అవకాశాలైతే రాలేదు. ఇక రాస్సీ భార్య లారా వాన్ డెర్ డుస్సెన్ మాత్రం స్టాండ్స్‌లో కూర్చుని రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్నప్పుడు భలే సపోర్ట్ చేస్తుంటుంది. తరచుగా చప్పట్లు, కేరింతలు కొడుతూ నానా హంగామా చేస్తుంది. చాహల్ భార్య ధనుశ్రీతో కలిసి స్టాండ్స్‌లో భలే సందడి చేస్తుంటుంది. (Instagram)
ఇక జోస్ బట్లర్ సిక్సులు కొడుతున్నప్పడల్లా స్టాండ్స్ లో కూర్చున్న లారాపై కెమెరామాన్ ఫోకస్ చేయడం పెద్దతప్పయిపోయింది. లారాను అభిమానులు జోస్ బట్లర్ భార్య అని భావించారు. అందుకేనేమో అంత సందడి చేస్తుందంటూ కొందరు కామెంట్లు కూడా చేశారు. అయితే ఆమె ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది. నేను బట్లర్ భార్యను కాను.. వాన్ డెర్ డస్సేన్ భార్యనని వివరించుకుంది. (Instagram)
'అభిమానులు నన్నే బట్లర్ భార్య అని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కొన్ని సార్లు కెమెరా కంట్లో పడడంతో బహుశా అలా అనుకుని ఉండుంటారు. అయినా పర్లేదు. టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న బట్లర్‌కు రెండో భార్యగా ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు (ఫన్నీగా). ధనశ్రీ, నేను మా ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాం. (Instagram)
ఇక, బట్లర్ భార్య, అతని కుటుంబం కూడా గత వారం రాజస్థాన్ జట్టు బయో బబుల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్ డెర్ డస్సెన్ భార్య లారా ఎక్కువగా కెమెరా కంట పడడంతో ఆమెనే బట్లర్ భార్య అని అభిమానులు పొరపాటు పడ్డారు. అసలింతకీ ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చిన లారా.. ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె సరదాగా ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ నెటిజన్లు దానికి పెడర్దాలు తీస్తున్నారు.