[caption id="attachment_1272468" align="alignnone" width="1600"] ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. నేడు అతడు తన 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిని ప్రియురాలు అతియా శెట్టి ఇన్ స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. (PC: INSTAGRAM)
[caption id="attachment_1272470" align="alignnone" width="565"] ఈ క్రమంలో కేఎల్ రాహుల్ తన ట్విట్టర్ ద్వారా లవ్ యూ అంటూ రిప్లే కూడా ఇచ్చాడు. దాంతో వీరిద్దరి లవ్ స్టోరి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అటు బాలీవుడ్, ఇటు క్రికెట్ ఎక్కడ చూసిన వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. (PC: INSTAGRAM)
ఇక 2019 డిసెంబర్ లో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే విషయం బయటకు వచ్చింది. అందుకు కారణం వీరిద్దరు కూడా 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లారు. అక్కడ వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటో బయటకు వచ్చింది. దాంతో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ మధ్య ఎదో జరుగుతుందని చాలా మంది అనుకున్నారు. (PC: INSTAGRAM)
[caption id="attachment_1272478" align="alignnone" width="458"] ఇక 2021లో తడప్ సినిమా ప్రీమియర్ సమయంలో వీరిద్దరి రిలేషన్ పై క్లారిటీ వచ్చింది. దానికి వీరిద్దరు కలిసి హాజరయ్యారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వీరు సినిమాకు రావడంతో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారని అర్థమయ్యింది. (PC: INSTAGRAM)
ఇక అక్కడి నుంచి వీరు తమ రిలేషన్ ను ఎక్కడా దాచే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా అతియా శెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ను రాహుల్ ఫోటోలతో ముంచేసింది. తాజాగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ కు కూడా అతియా శెట్టి తన తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టితో హాజరైంది. అయితే ఆ మ్యాచ్ లో రాహుల్ బౌల్ట్ దెబ్బకు గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. (PC: INSTAGRAM)