రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు హర్భజన్ పేర్కొన్నాడు. ’ప్రస్తుతం ఉన్న ఆర్సీబీ జట్టు చాలా బలంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో ఎన్నడూ లేని విధంగా ఆ జట్టులో మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఈసారి ఐపీఎల్ చాంపియన్ గా ఆర్సీబీ అవతరించడం ఖాయం‘ అని నమ్మకంగా చెప్పాడు.