IPL 2022 : తల్లి మృత్యువుతో పోరాటం.. కొడుకు మైదానంలో మ్యాచ్ విన్నింగ్ స్పెల్
IPL 2022 : తల్లి మృత్యువుతో పోరాటం.. కొడుకు మైదానంలో మ్యాచ్ విన్నింగ్ స్పెల్
IPL 2022 Final : క్వాలిఫయర్ 1లో రాజస్తాన్ రాయల్స్ పై గెలవడం ద్వారా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరగా.. క్వాలిఫయర్ 2లో నెగ్గిన రాజస్తాన్ రాయల్స్ టైటిల్ కోసం మరోసారి గుజరాత్ తో పోరాడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ చాంపియన్ ఎవరో తేలేందుకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)లలో ఒక జట్టు చాంపియన్ గా అవతరించడం ఖాయమైంది.
2/ 6
క్వాలిఫయర్ 1లో రాజస్తాన్ రాయల్స్ పై గెలవడం ద్వారా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరగా.. క్వాలిఫయర్ 2లో నెగ్గిన రాజస్తాన్ రాయల్స్ టైటిల్ కోసం మరోసారి గుజరాత్ తో పోరాడనుంది.
3/ 6
శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ 2లో రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. దాంతో 2008 తర్వాత మరోసారి ఫైనల్ లో ప్రవేశించింది.
4/ 6
అయితే ఈ మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ కుమార సంగక్కర తన టీం బౌలర్ ఒబెద్ మెకాయ్ గురించి ఒక విషయాన్ని బయటపెట్టాడు. ఈ మ్యాచ్ జరిగే సమయానికి మెకాయ్ తల్లి వెస్టిండీస్ లో తీవ్ర అనారోగ్యంతో మృత్యువుతో పోరాడుతున్నట్లు సంగక్కార పేర్కొన్నాడు.
5/ 6
అయినప్పటికీ మెకాయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినట్లు సంగక్కార పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆట పట్ల తనకున్న అంకితభావాన్ని అతడు అందరికీ తెలియజేశాడని పేర్కొన్నాడు.
6/ 6
ఆర్సీబీతో జరిగిన పోరులో మెకాయ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఇక మరో పేసర్ ప్రసిధ్ కూడా 3 వికెట్లతో చెలరేగడంతో ఆర్సీబీని తక్కువ స్కోరుకే కట్టిడి చేసిన రాజస్తాన్.. అనంతరం అద్భుత విజయాన్ని అందుకున్నాడు.