టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక, ఈ సూపర్ హాఫ్ సెంచరీతో గబ్బర్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 50 పైగా పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా ధావన్ రికార్డు సృష్టించాడు.