ఐపీఎల్ 2022 సీజన్‌తో తమ జట్లతో ఏ ఆటగాళ్లను కొనసాగించాలనే విషయంపై పాత 8 జట్లు తీవ్ర కసర్తతు చేస్తున్నాయి. ఐపీఎల్ రిటెన్షన్ పాలసీని అనుసరించి నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే వీలుంది. ఇందులో గరిష్టంగా ముగ్గురు ఇండియన్స్, ఇద్దరు ఫారినర్స్ ఉండొచ్చు. ముగ్గురు ఇండియన్స్‌లో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ నియమాలను అనుసరిస్తూ నలుగురిని అట్టిపెట్టుకోవచ్చు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రిటెన్షన్ గడువు ముగుస్తుండటంతో అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే ఎవరెవరిని జట్టులో ఉంచుకోవాలననే విషయంపై ఒక స్పష్టతకు వచ్చాయి. (PC: IPL)
ఢిల్లీ క్యాపిటల్స్ ఆ జట్టు మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను విడుదల చేయనున్నది. ప్రస్తుత కెప్టెన్ రిషబ్ పంత్‌తో పాటు, పృథ్వీషా, అక్షర్ పటేల్, ఎన్రిక్ నోర్జేలను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోనున్నది. డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విలకు ఈ సారి మొండి చేయి చూపించింది. (PC: IPL)
ఐపీఎల్ 2021లో రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేసుకోవడానికి నిర్ణయించింది. ఆండ్రీ రస్సెల్, సునిల్ నరైన్, పాట్ కమిన్స్‌లో ఒకరికి విదేశీ కోటాలో స్థానం దక్కవచ్చు. అయితే ఆ జట్టు కెప్టెన్ ఇయన్ మెర్గాన్కు జట్టులో చాన్స్ లభించకపోవచ్చు. గత సీజన్లో బ్యాటర్‌గా అతడు విఫలం కావడంతో విడుదల చేయడానికే కేకేఆర్ నిర్ణయించుకున్నది. (PC: IPL)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఇద్దరి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోనున్నారు. ఇక మిగిలిన రెండు ఖాళీల్లో.. దేవ్‌దత్ పడిక్కల్, యువేంద్ర చాహల్, కేఎస్ భరత్‌లో ఇద్దరికి చాన్స్ దక్కే అవకాశం ఉన్నది. ఇక ఆర్సీబీ కైల్ జేమిసన్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్‌లకు విడుదల చేయడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. (PC: IPL)
గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసిన పంజాబ్ కింగ్స్ ఈ సారి పూర్తిగా కొత్త జట్టుతో రాబోతున్నది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇప్పటికే రిటైన్ చేసుకోవద్దని స్పష్టం చేశాడు. అతడు కొత్త ఫ్రాంచైజీకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సారి ఎవరినీ రిటైన్ చేసుకోవద్దని పంజాబ్ యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం. అదే జరిగితే షారుక్ ఖాన్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు వేలంలోకి వస్తారు. (PC: IPL)
గత సీజన్లో పేలవ ప్రదర్శన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పూర్తి ప్రక్షాళనపై దృష్టి పెట్టింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోబోతున్నది. ఇక రషీద్ ఖాన్‌తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అతడికి రూ. 12 కోట్ల శాలరీ ఇస్తామని చెప్పింది. కానీ రషీద్ ఇంకా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడు. జీతం విషయం పక్కన పెడితే రషీద్ తిరిగి సన్‌రైజర్స్ జట్టులో ఉండటం ఖాయమే. వీరిద్దరినే ప్రస్తుతం రిటైన్ చేసుకోవడానికి ఎస్ఆర్హెచ్ నిర్ణయించింది. (PC: IPL)