ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఎన్నడూ లేని విధంగా తాజా సీజన్లో చెత్త ప్రదర్శనతో తన అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా మూడు సార్లు గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 216 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. మూడు మ్యాచ్‌ల్లో అతను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అతని కెరీర్ చివరి దశకు చేరిందనే ప్రచారం ఊపందుకుంది.
ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్‌కప్ కూడా జరగనుండటంతో.. విరాట్ కోహ్లీ ఫామ్‌పై టీమిండియాలోనూ ఆందోళన మొదలైంది. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ కోల్పోయిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్యాటర్‌గా రాణిస్తాడని భావించిన కోహ్లీ అభిమానులకు నిరాశే ఎదురైంది.