ఆ సీజన్ లో ఏప్రిల్ 23న పుణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టుకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించగా.. పుణే వారియర్స్ కు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) నాయకుడిగా ఉన్నాడు. తొలుత ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ కు దిగగా.. గేల్, దిల్షాన్ లు ఓపెనర్లుగా వచ్చారు.
[caption id="attachment_847194" align="alignnone" width="1050"] ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేసిన గేల్.. పలు రికార్డులను నమోదు చేశాడు. అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఈ మ్యాచ్ లో గేల్ 17 సిక్సర్లు బాదగా.. టి20 ఫార్మాట్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా గేల్ పేరిటే ఇప్పటికీ రికార్డు ఉంది.
ఇక పుణే కెప్టెన్ గా యువరాజ్ సింగ్ కు ఇది పీడకల లాంటిది. గేల్ బ్యాటింగ్ కు ఎలా ఫీల్డ్ సెట్ చేయాలో యువీకి అస్సలే అర్థం కాలేదు. ఇక ఆరోన్ ఫించ్ తాను వేసిన ఏకైక ఓవర్ లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే భువనేశ్వర్ కుమార్ మాత్రం తన నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం.