ఐపీఎల్ వేలం (IPL Auction 2022) పూర్తవడం, పలు ప్రాంఛైజీలు కెప్టెన్లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక, ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్లో పూర్తి కొత్త జట్టుతో బరిలో దిగుతోంది పంజాబ్ కింగ్స్ (Punjab Kings). ఐపీఎల్ మెగా వేలానికి ముందు మయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్ మినహా మిగిలిన ప్లేయర్లందరినీ వేలానికి వదిలేసింది ప్రీతి జింటా టీమ్.
గత రెండు సీజన్లలో 400కు పైగా పరుగులు సాధించాడు. 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టిన అతడు 100కు పైగా మ్యాచులు ఆడగా..భారత్ తరఫున 19 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.ఇప్పటి వరకూ కప్పు గెలవని పంజాబ్ ఈ సారైనా ట్రోఫీని దక్కించుకోవాలని ఆశలు పెట్టుకుంది. 2014లో ఫైనల్లో అడుగుపెట్టిన పంజాబ్ గత మూడు సీజన్లలోనూ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.