IPL 2022 NEWS NO PLACE FOR MS DHONI AND VIRAT KOHLI IN SACHIN TENDULKARS ALL TIME PLAYING XI SJN
Sachin Tendulkar : ధోని, కోహ్లీలకు దిమ్మ తిరిగే షాకిచ్చిన సచిన్ టెండూల్కర్.. షాక్ లో క్రికెట్ ఫ్యాన్స్
Sachin Tendulkar : ఇక అంతర్జాతీయ కెరీర్ లో 100 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ గా కూడా సచిన్ ఉన్నాడు. అయితే తాజాగా ఈ క్రికెట్ గాడ్ భారత మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 30 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో 15,921 పరుగులను చేసిన అతడు టెస్టుల్లో 18,426 రన్స్ సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
2/ 7
ఇక అంతర్జాతీయ కెరీర్ లో 100 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ గా కూడా సచిన్ ఉన్నాడు. అయితే తాజాగా ఈ క్రికెట్ గాడ్ భారత మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు.
3/ 7
ప్రతి క్రికెటర్ కూడా తన ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ అంటూ 11 మందితో ఒక జట్టును ప్రకటిస్తూ ఉంటారు. అలాగే తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా తన ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ ను ప్రకటించాడు.
4/ 7
అయితే ఇందులో భారత మాజీ కెప్టెన్లు ధోని, విరాట్ కోహ్లీలను చోటు కల్పించలేదు. అదే సమయంలో తన పేరును కూడా తుది జట్టులో చేర్చకపోవడం విశేషం. సచిన్ ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ లో ధోని, కోహ్లీలకు చోటు దక్కకపోవడంతో వారి ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు.
5/ 7
అయితే భారత్ నుంచి నలుగురు ప్లేయర్లకు చోటు కల్పించాడు. వారిలో సౌరవ్ గంగూలీ, సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ ఉన్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి రికీ పాంటింగ్, స్టీవ్ వాలకు చోటు ఇవ్వకపోవడం విశేషం.
6/ 7
ఈ టీంకు గంగూలీని కెప్టెన్ ను చేశాడు. ఇక ఆసీస్ నుంచి గిల్ క్రిస్ట్, గ్లెన్ మెక్ గ్రాత్, దివంగత ప్లేయర్ షేన్ వార్న్ లను, విండీస్ నుంచి బ్రియాన్ లారా, వీవ్ రిచర్డ్స్ లకు చోటు కల్పించాడు. పాకిస్తాన్ నుంచి స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ కు, సౌతాఫ్రికా నుంచి జాక్వస్ కలీస్ కు చోటు కల్పించాడు.
7/ 7
ఇక ప్లేయింగ్ ఎలెవన్ ను ఒకసారి పరిశీలిస్తే.. వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గావస్కర్, బ్రియాన్ లారా, వీవ్ రిచర్డ్స్, కలీస్, గంగూలీ, ఆడమ్ గిల్ క్రిస్ట్, షేన్ వార్న్, వసీం అక్రమ్, హర్భజన్ సింగ్, మెక్ గ్రాత్.