ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే.. గుజరాత్ టీమ్ ఈ ఏడాది నుంచి ఐపీఎల్ లో ఎంట్రీ ఇవ్వగా దానికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ లో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాకు ఇది తొలి సీజన్. అయినా కూడా చాలా చక్కగా కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్ లు ఆడగా.. అందులో 9 సార్లు విజేతగా నిలిచింది. మరో మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ కు చేరిన తొలి జట్టు కూడా గుజరాతే కావడం విశేషం. ( IPL Twitter)