[caption id="attachment_1257994" align="alignnone" width="1200"] ఇంతకీ వాన్ సలహా ఏంటంటే.. కోహ్లీ తనకు పెళ్లైందనే విషయాన్ని కూతురు ఉందనే విషయాన్ని మర్చిపోవాలంట. 10 ఏళ్ల క్రితం ఎలా క్రికెట్ ఆడాడో గుర్తు తెచ్చుకొని అలానే ఆడాలంటూ పేర్కొన్నాడు. కోహ్లీ కెరీర్ ఆరంభంలో ఏ విధంగా అయితే ఫియర్ లెస్ క్రికెట్ ఆడాడో అదే విధంగా ఆడితే ఫామ్ లోకి తప్పక వస్తావని ఈ విషయాన్ని తన మాటగా కోహ్లీ చెవిన పడేయాలంటూ డు ప్లెసిస్ కు తెలిపాడు.
కోహ్లీ ఇప్పుడు కూడా ఫియర్ లెస్ క్రికెటే ఆడుతున్నాడు. తొలి బంతి నుంచే పరుగులు సాధించాలనే ప్రయత్నంలో మూడు సార్లు కూడా గోల్డెన్ డక్ గా పెలియన్ కు చేరాడు. అయితే ఏ క్రికెటర్ కు అయినా సరే తన కెరీర్ లో ఏదో ఒక సందర్భంతో చీకటి రోజులు ఎదురుకాక తప్పదు. ప్రస్తుతం కోహ్లీ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం కోహ్లీ కవర్ డ్రైవ్ షాట్లను ఆడే క్రమంలో అవుటవుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా సచిన్ కూడా కవర్ డ్రైవ్ షాట్లు ఆడే క్రమంలో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరేవాడు. దాంతో సిడ్నీ టెస్టులో సచిన్ కవర్ డ్రైవ్ ఆడకుండానే తన బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ మ్యాచ్ లో సచిన్ 248 రన్స్ తో అజేయంగా నిలిచాడు. కోహ్లీ కూడా ప్రస్తుతం సచిన్ లాంటి డెడికేషన్ ను ప్రదర్శించాల్సిన తరుణం ఆసన్నమైంది.