[caption id="attachment_1298636" align="alignnone" width="1600"] ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తుందని అందరికీ తెలుసు. అదే సమయంలో వారికి చెడును కూడా చేస్తోందని కొంత మంది మాత్రమే గ్రహించగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ కాసుల లీగ్ టీమిండియా (Team India) ప్లేయర్ల పాలిట శాపంగా మారింది.
కాసుల వేటలో బీసీసీఐ (BCCI) ఇప్పటికే మితిమీరిన క్రికెట్ షెడ్యూల్ తో టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి అనేదే లేకుండా చేస్తోంది. సిరీస్ తర్వాత సిరీస్ అంటూ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక మధ్యలో ఐపీఎల్. ఫ్రాంచైజీలు తమను కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేయడంతో అలసిపోయినా కూడా మన టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడాల్సి వస్తోంది.
ఈ క్రమంలో వీరంతా కూడా గాయాల బారిన పడుతున్నారు. తాజాగా జరుగుతోన్న ఐపీఎల్ 2022 సీజన్ కారణంగా కొందరు టీమిండియా ప్లేయర్లు కొత్త గాయాల బారిన పడుతోంటే మరికొందరు తమ పాత గాయాలను తిరగబెట్టించుకుంటున్నారు. ఇక ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా టి2 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐదుగురు భారత ప్లేయర్లు ఐపీఎల్ కారణంగా గాయాల బారిన పడ్డారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ సందర్భంగా దీపక్ చహర్ గాయపడిన సంగతి తెలిసిందే. చహర్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 14 కోట్లకు సొంతం చేసుకోవడంతో.. అతడిని ఎలాగైనా ఈ సీజన్ లో ఆడించాలనే పట్టుదలతో ఉండింది. ఈ క్రమంలో దీపక్ చహర్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో తీవ్రంగా శ్రమించాడు. దాంతో అతడు నడుం గాయం బారిన పడ్డాడు. ఫలితంగా ఈ సీజన్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. అతడు కోలుకొని తిరిగి టీమిండియాకు ఎప్పుడు ఆడతాడో ఎవరూ చెప్పలేని పరిస్థితి.
కేజీఎఫ్ 2 కలెక్షన్స్, ఆచార్య మూవీ రిలీజ్ డేట్, ఐపీఎల్ 2022 ఆరెంజ్ క్యాప్, ఐపీఎల్ 2022 పర్పుల్ క్యాప్" width="1600" height="1600" /> ఇక అదే సమయంలో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా మోచేతి గాయంతో మిగిలిన ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. ఆరంభంలో గాయంతో అతడు కొన్ని మ్యాచ్ లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అనంతరం కోలుకున్న అతడు ముంబై తరఫున మ్యాచ్ లు ఆడాడు. సూపర్ ఫామ్ తో అదరగొట్టాడు. అయితే సీజన్ ఆఖర్లో గాయంతో తప్పుకున్నాడు. సూర్యకుమార్ తో పాటు రవీంద్ర జడేజా కూడా గాయం బారిన పడ్డాడు. (IPL Twitter)
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి రవీంద్ర జడేజా టీమిండియాకు చాలా కీలకం. అయితే అతడు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అటు బంతితో గానీ ఇటు బ్యాట్ తో కానీ ఏ మాత్రం ప్రభావం చేపలేకపోయాడు. తాజాగా ప్రక్కటెముకల గాయం అంటూ మిగిలిన సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఇక అదే సమయంలో సన్ రైజర్స్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్ కూడా గాయాలతో గత కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే టి20 ప్రపంచకప్ లో డెత్ ఓవర్ల స్పెషలిస్టు నటరాజన్ కీలక పాత్ర పోషిస్తాడని అందరూ భావించారు. అయితే అతడు మరోసారి గాయం బారిన పడటంతో అతడు తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకునేది కష్టంగానే కనపిస్తోంది.