ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఐపీఎల్-2022 (IPL 2022)లో పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోను ఓటమి చెంది పాయింట్ల పట్టికలో ముంబై ఆఖరి స్థానంలో నిలిచింది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబైై ఇండియన్స్ ఓడిపోయింది. 12 పరుగుల తేడాతో పరాజయం పొందింది. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమైంది.
మరోవైపు, ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఓ చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ సీజన్లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఓడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందిన ముంబై ఈ చెత్త రికార్డును మూట కట్టుకుంది.అంతకుముందు 2014 సీజన్లోనూ తొలి ఐదు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఓటమి పాలైంది.ఆ తర్వాత ఈ సీజన్ లోనే అత్యంత చెత్త ప్రదర్శనతో అప్రతిష్టను మూటగట్టుకుంది.