రోహిత్ శర్మ అంటే కూల్ అని అందరూ అంటుంటారు. విరాట్ కోహ్లీది అగ్రెసివ్ అప్రోచ్ అయితే.. రోహిత్ ది కూల్ అప్రోచ్ అన్న భావన ఉంది. ధోనీ తర్వాత మిస్టర్ కూల్ గా రోహిత్ ను పిలుస్తుంటారు. అలాంటి రోహిత్ ఎప్పుడైనా కోప్పడడం చూశారా? కోపం కాదు.. ఆటగాళ్లను బూతులు తిట్టేస్తాడని చెబుతున్నాడు యువ డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్.
"అంతర్జాతీయ క్రికెట్లో నేను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టాను. అయితే అది విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే ఆ భారీ సిక్సర్ బాదాను. నేను మైదానంలోకి రాగానే అక్కడ ఫీల్డర్లు లేరు ఆ దిశగా సిక్స్ కొట్టమని విరాట్ భాయ్ సలహా ఇచ్చాడు. అయితే ఆర్చర్ బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు. కానీ అతను చెప్పింది వాస్తమమే అనిపించింది. సిక్స్ కొట్టాలని గట్టిగా నిర్ణయించుకొని బాదాను." అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.