టీమిండియా కెప్టెన్ రోహిత్ (Rohit Sharma) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచి.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అలాంటి జట్టు ఏడు మ్యాచ్ లు ఆడినా.. ఒక్క మ్యాచ్ లోనూ గెలవకుండా ఉంటుందని ఊహించడం సాధ్యమా! కానీ, ఐపీఎల్ 2022లో మాత్రం అదే జరిగింది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఒక్క దాంట్లోనూ గెలవలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఎన్నడూ లేని విధంగా మాజీ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. 2008, 2009 సీజన్ లలో ప్రదర్శించిన చెత్త ప్రదర్శన కంటే దారుణంగా ఈ సీజన్ లో ఆ జట్టు ఆడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 15వ సీజన్ లో రోహిత్ సారథ్యంలోని ముంబై జట్టు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది.
దాంతో లీగ్ లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లోనూ ఓడింది. తద్వారా ఐపీఎల్ లో వరుసగా ఏడు మ్యాచ్ లు ఓడిన తొలి జట్టుగా నిలిచింది. అంతకుముందు ఈ చెత్త రికార్డు ఢిల్లీ డేర్‌డెవిల్స్ (2013లో), ఆర్సీబీ (2019లో) ఉండేది. ఈ రెండు కూడా సీజన్ ఆరంభంలో మొదటి ఆరు మ్యాచ్‌లలో ఓటమి పాలైన జట్లుగా పేరొందాయి. తాజాగా ఆ రికార్డును ముంబై తన ఖాతాలో వేసుకుంది.
ముంబై తన ప్రదర్శనతో ఇతర జట్ల ప్లే ఆఫ్ అవకాశాలపై దెబ్బతీసే అవకాశం ఉంది. ముంబై గెలిచినా, ఓడినా ప్లే ఆఫ్ రేస్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్లే ఆఫ్ రేస్ కోసం కాకపోయినా.. కనీస పరువు కోసం ముంబై తాడోపేడో తేల్చుకునే ఛాన్సుంది. దీంతో, ముంబైతో మ్యాచ్ అంటే మిగతా జట్లు అలర్ట్ అవ్వాల్సిందేనని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.