ఈ క్రమంలో తనకు స్కై (SKY) అనే పేరు ఎలా వచ్చిందో.. దానిని ఎవరు పెట్టారో? రివీల్ చేశాడు. 2014 నుంచి 2017 మధ్య సూర్యకుమార్ యాదవ్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడాడు. ’2014లో జరిగిన ఒక మ్యాచ్ సందర్భంగా అప్పటి జట్టు కప్టెన్ గౌతం గంభీర్.. స్కై.. స్కై అంటూ రెండు మూడు సార్లు గట్టిగా పిలిచాడు. నన్ను కాదన్నట్లు నేను సైలెంట్ గా ఉన్నా. అయితే కొద్ది సేపటి తర్వాత అతడు నా దగ్గరకు వచ్చి పలిచిందే నిన్నే అన్నాడు. అంతేకాకుండా నా పేరు పెద్దగా ఉందని.. అంత పెద్ద పేరు పెట్టి పిలవడం నా వల్ల కాదు అని గంభీర్ భయ్యా అన్నాడు. అందుకే నా పేరులోని మొదటి అక్షరాలతో కలిపి స్కై అంటూ పిలిచాడు. ఇక అప్పటి నుంచి నన్ను అందరూ స్కై అని పిలవడం మొదలు పెట్టారు‘ అని సూర్యకుమార్ స్కై వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలిపాడు.