అయితే ఇటీవల ధోని ఇచ్చిన ఒక స్టేట్ మెంట్ తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కామెంటేటర్ తో మాట్లాడుతూ తాను ఎల్లో జెర్సీలో కనిపించడం ఇదేమీ చివరిసారి కాదన్నాడు. ఇక్కడి వరకు అంతా బాగాను ఉన్నా.. చివర్లో మరో వాక్యం జోడించడంతో ధోని ఉద్దేశంపై గందరగోళం నెలకొంది. అదేంటంటే తనను కచ్చితంగా ఎల్లో జెర్సీలో చూస్తారని చెప్పిన ధోని.. అది ప్లేయర్స్ ధరించే ఎల్లో జెర్సీనా.. లేక వేరే ఎల్లో జెర్సీనా అనేది తెలుసుకోవాలంటే వేచి ఉండాలని కోరాడు.
ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, షేన్ వాట్సన్, రికీ పాంటింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ లోకి షేన్ వాట్సన్" width="1600" height="1600" /> ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ’ వేరే ఎల్లో జెర్సీలో అంటే ధోని తప్పకుండా కోచ్ గా వచ్చే ఐపీఎల్ లో మనకు దర్శనం ఇవ్వొచ్చు. అతి ప్రధాన కోచా లేక అసిస్టెంట్ కోచా అనేది కాలమే నిర్ణయిస్తుంది.‘ అని వాట్సన్ పేర్కొన్నాడు. దీనిని బట్టి ఆటగాడిగా ధోనికిదే చివరి సీజన్ అనే విషయం మనకు క్లారిటీ వస్తోంది. వచ్చే సీజన్ నుంచి అతడు చెన్నై కోచ్ గా మనందరినీ అలరించే అవకాశం ఉందన్నమాట.