ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో.. ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. ధోనీ తప్పుకోవడంతో ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకి అప్పగించింది ఫ్రాంచైజీ.
కెప్టెన్ కూల్‌గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ 12 సీజన్లు ఆడిన సీఎస్కే 11 సార్లు ప్లేఆఫ్స్ చేరింది. అత్యధికంగా 9సార్లు ఫైనల్ ఆడి, నాలుగు సార్లు టైటిల్‌ను ముద్దాడింది. ఇక, ఓవరాల్ గా కెప్టెన్‌గా ధోనీ మొత్తం 300 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 177 మ్యాచుల్లో విజయం సాధించాడు మహేంద్రుడు.
ఇక నుంచి ధోని కేర్ టేకర్ ప్లేయర్ గా బాధ్యతలు వ్యవహరించనున్నాడు. ధోని కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికి.. సీఎస్కేలో ఆటగాడిగా.. అటు మెంటార్‌గా తన సలహాలు మాత్రం వస్తూనే ఉంటాయి. జడేజా ప్రత్యక్షంగా కెప్టెన్ అయినప్పటికి.. పరోక్షంగా మాత్రం ధోనినే నడిపిస్తాడనేది అందరికి తెలిసిన సత్యం. చెన్నైకి భవిష్యత్తు కెప్టెన్ అందించడానికే ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ ఐపీఎల్ షెడ్యూల్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2022 షెడ్యూల్, హైదరాబాద్ టీం ఐపీఎల్ 2022 షెడ్యూల్, కేన్ విలియమ్సన్, సన్ రైజర్స్ హైదరాబాద్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ధోని" width="1600" height="1600" /> మరోవైపు జడేజా కూడా 2012 నుంచి సీఎస్కేతో పాటే ఉన్నాడు. ధోనికి అత్యంత నమ్మకమైన ఆటగాళ్లలో రైనా తర్వాత జడేజానే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఏరికోరి కెప్టెన్సీని అతడికే అప్పగించాడు.