టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత మెంటార్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2022 నుంచి రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. దుబాయ్లో జరిగిన టెండర్ల ప్రక్రియలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్స్, లక్నో జట్టును ఆర్పీ- సంజీవ్ గోయెంకా గ్రూప్ దక్కించుకున్నాయి. (PC: BCCI/IPL)
ఎంఎస్ ధోనీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలుచుకున్నాడు. వచ్చే ఏడాది ధోనీ సీఎస్కే తరపున ఆడతాడా లేదా అన్న డైలమా కూడా ఉన్నది. అయితే అతడు ప్రమోట్ చేసిన రిథి టెండర్లలో పాల్గొనడానికి ప్రయత్నించడంతో.. ధోనీ ఇక సీఎస్కేను వీడతాడనే అందరూ భావించారు.
ప్రస్తుతం ధోనీ సంస్థలకు ఐపీఎల్ అవకాశం లేక పోవడంతో తిరిగి సీఎస్కేతోనే ఉంటాడని ఫ్యాన్స్ సంబరపడుతున్నాడు. ఏదేమైనా కేవలం కొద్ది నిమిషాల ఆలస్యంగా వచ్చినందుకు రిథి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ భారీ మూల్యాన్నే చెల్లించుకున్నది.