వయసు అయిపోయిందన్నారు.. జిడ్డు బ్యాటింగ్ తో నరకం చూపిస్తున్నాడన్నారు.. ఇక, ఆడటం అవసరమా అని ట్రోల్ చేశారు. వీటన్నటికీ తనదైన స్టైల్ లో సమాధానమిస్తున్నాడు మహేంద్రుడు (MS Dhoni). లేటు వయసులో అరుదైన రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ సీజన్ లో అభిమానులకు సరికొత్త ధోనిని చూపిస్తున్నాడు.