[caption id="attachment_1200842" align="alignnone" width="1600"] ఈ జాబితాలో తొలి స్థానంలో ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఉంటాడు. ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రూ. 15.25 కోట్ల ధర పలికాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో అర్ధ శతకాలతో రాణించాడు. దాంతో ఇషాన్ కిషన్ పై పెట్టిన ధర ముంబై జట్టుకు గిట్టుబాటు అయ్యేలానే కనిపించింది. కానీ.. తర్వాతే అతడి ఆట గాడి తప్పింది. చివరి ఐదు మ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై 81 పరుగులతో అజేయంగా నిలిచిన కిషన్.. లక్నోపై 54 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత జరిగిన ఐదు మ్యాచ్ ల్లోనూ వరుసగా 14, 26, 3, 13, 0 స్కోర్లు చేసి దారుణంగా నిరాశ పరిచాడు. ఈ సీజన్ లో 7 మ్యాచ్ ల్లో 191 పరుగులు చేయగా.. ఆఖరి ఐదు మ్యాచ్ ల్లో 56 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై ఆడిన ఏడు మ్యాచ్ ల్లోనూ ఓడి దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.
[caption id="attachment_1200860" align="alignnone" width="1600"] ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ది లార్డ్ శార్దుల్ ఠాకూర్. గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ ()కు ఆడిన ఇతడు.. మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. బ్యాటింగ్ లో మెరుపులు, బౌలింగ్ లో వికెట్లు తీస్తాడని భావించిన ఢిల్లీ జట్టును శార్దుల్ తన ప్రదర్శనతో ఏడిపిస్తున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్ ల్లోనూ ఒక్కసారి కూడా ఆకట్టకునే ప్రదర్శనను శార్దుల్ చేయలేకపోయాడు. ఏడు మ్యాచ్ ల్లో కేవలం నాలుగు వికెట్లే తీసిన అతడు.. 80 పరుగులు చేశాడు. బౌలింగ్ లో అత్యుత్తమం 30 పరుగులకు రెండు వికెట్లు. వికెట్లు తీయకున్నా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడా అంటే.. అదీ లేదు. ఓవర్ కు 9.60 ఎకానమీతో పరుగులు సమర్పించుకుంటున్నాడు.
వేలంలో పది కోట్లు పలికి నిరాశ పరుస్తున్న ప్లేయర్స్ లో శ్రేయస్ అయ్యర్ ఒకరు. వేలంలో రూ. 12.25 కోట్లు పలికిన ఇతడిని కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. కెప్టెన్ గా నియమించింది. ఆరంభంలో శ్రేయస్ అటు కెప్టెన్ గా ఇటు బ్యాటర్ గా ఫర్వాలేదనిపించాడు. అయితే సీజన్ గడిచే కొద్ది రెండంటిలోనూ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అటు కెప్టెన్ గా తప్పుడు వ్యూహాలతో పాటు బ్యాటర్ గా చెత్త ప్రదర్శన చేస్తూ ఓనర్లకు బాధను మిగులుస్తున్నాడు. ఏడు మ్యాచ్ ల్లో రెండు అర్ధ శతకాలతో 236 పరుగులు చేసిన అయ్యర్.. జట్టును మూడింటిలో గెలిపించి మరో నాలుగింటిలో ఓటమి పాలు చేశాడు. ఆఖరి రెండు మ్యాచ్ ల్లోనూ ఆ జట్టు ఓడటం ఇతడి కెప్టెన్సీపై అనుమానాలను రేపుతోంది.
గతేడాది ఐపీఎల్ లో ఏకంగా 32 వికెట్లు తీసిన హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ తో అందరినీ ఆశ్యర్యపరిచారు. డెత్ ఓవర్లలో వైవిధ్యమైన బంతులను వేయడంతో హర్షల్ సక్సెస్ కావడంతో వేలంలో రూ. 10.75 కోట్లు పెట్టి ఆర్సీబీ మళ్లీ సొంతం చేసుకుంది. అయితే సీజన్ లో మాత్రం ఇతడు అంచనాలను అందుకోలేకపోయాడు. 6 మ్యాచ్ ల్లో కేవలం 8 వికెట్లు మాత్రమే తీశాడు. గతేడాది ఇతడి ప్రదర్శనతో దీన్ని పోల్చి చూస్తే ఇది చాలా పేలవం. ఇక మ్యాచ్ ల్లో నైనా ఇతడు రాణించాలని ఆర్సీబీ కోరుకుంటుంది. (Twitter)
ఈ జాబితాలో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ కూడా ఉన్నాడు. వేలంలో రూ. 10 కోట్లు పలికిన ఇతడు.. రాజస్తాన్ తరఫున 7 మ్యాచ్ ల్లో కేవలం 8 వికెట్లు మాత్రమే తీశాడు. టీమిండియాకు పోటీ పడుతున్న ఇతడి నుంచి ఈ ప్రదర్శన అంటే పేలవమనే చెప్పాలి. వీరితో పాటు రూ. హసరంగా.. లోకీ ఫెర్గూసన్, అవేశ్ ఖాన్ లు కూడా రూ. 10 కోట్లకు పైనే పలికి అందుకు తగిన ప్రదర్శన మాత్రమ చేయలేకపోతున్నారు.