ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ప్రత్యేక స్థానం ఉంది. ఐపీఎల్ టైటిల్ ను ఇప్పటి వరకు ఐదు సార్లు సొంతం చేసుకుని.. అత్యధికసార్లు లీగ్ విజేతగా నిలిచిన జట్టుగా ఉంది. అయితే తాజా సీజన్ లో ముంబై ఇండియన్స్ రాత సరిగ్గా లేదు. బ్యాటింగ్ లో మెరుస్తున్నా.. బౌలింగ్ లో మాత్రం తేలిపోతుంది. ఈ క్రమంలో ముంబై ఇలా కావడానికి గల కారణాలను క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ తెలియజేశాడు.
ఈ లెక్కన ఈ ముగ్గురు ప్లేయర్ల కోసమే ముంబై ఇండియన్స్ రూ. 31.50 కోట్లను ఖర్చు చేసింది. ఇక మిగిలిన డబ్బు అంటే రూ. 16.50 కోట్లతో 14 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇదొక్కటి చాలు వేలంలో ముంబై ఇండియన్స్ ఎంతటి పెద్ద తప్పును చేసిందో. ఇదే విషయాన్ని వాట్సన్ ఇప్పుడు పేర్కొన్నాడు. ఉన్న డబ్బంతా వీరిపైనే ఖర్చు చేసిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత మంచి ప్లేయర్లను కొనుగోలు చేయలేకపోయింది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో అశ్విన్, చహల్, చహర్ లలో ఒకరిని తీసుకోవాల్సింది.
ఇషాన్ కిషన్ తొలి రెండు మ్యాచ్ లు అదరగొట్టి... అనంతరం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇక టిమ్ డేవిడ్ తొలి రెండు మ్యాచ్ లు తుది జట్టులో చోటు దక్కించుకున్నా పేలవ ప్రదర్శనతో స్థానం కోల్పోయాడు. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు చహల్ కు అవుటైన తీరును చూస్తే.. క్రికెట్ ఆడే కనీస స్కిల్స్ అతడికి లేవని క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. కానీ. ఇతర లీగ్ ల్లో భారీ షాట్లు ఆడాడనే కారణంతో అతడిపై ఏకంగా రూ. 8.25 కోట్లను ముంబై ఖర్చు చేసింది. ఇక జోఫ్రా ఆర్చర్ అయితే ఈ సీజన్ కు అందుబాటులో ఉండడని తెలిసినా అతడిపై రూ. 8 కోట్లు ఖర్చు చేయడానికి వెళ్లింది. అలా అని వచ్చే సీజన్ లో అతడు గ్యారెంటీగా ఆడతాడా అంటే అదీ డౌటే.. బయె బబుల్ వల్ల తన మానసిక పరస్థితి బాగోలేదు. అందుకే తప్పుకుంటున్నా అని ఇతర ఇంగ్లండ్ ప్లేయర్స్ లా చెప్పినా చెబుతాడు.