KL Rahul : వందలో వంద.. లక్నో కెప్టెన్ నయా చరిత్ర.. ముంబై అంటే చాలు రాహుల్ శివతాండవం ఆడేస్తాడు..
KL Rahul : వందలో వంద.. లక్నో కెప్టెన్ నయా చరిత్ర.. ముంబై అంటే చాలు రాహుల్ శివతాండవం ఆడేస్తాడు..
KL Rahul : లక్నో సారథి ముంబైపై తన ప్రతాపం ఏంటో చూపాడు. కళాత్మకమైన విధ్వంసంతో తన జట్టుకు భారీ స్కోరు అందించాడు. దీంతో, అరుదైన రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) తన స్టైలిష్ బ్యాటింగ్ తో మరోసారి మెరిశాడు. ముంబై మ్యాచులో 9 ఫోర్లు, 5 సిక్సులతో 60 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు కేఎల్ రాహుల్. ఇక, సూపర్ సెంచరీతో అరుదైన రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
2/ 8
ఐపీఎల్లో ఈ మ్యాచ్ రాహుల్‌కు 100వది. దీంతో 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆరంభం నుంచి చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రాహుల్ చివరి వరకు ఆడి అజేయంగా నిలిచాడు.
3/ 8
నిజానికి ఈ మ్యచ్ మందు వరకు ఈ సీజన్లో రాహుల్ సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. తాజాగా సెంచరీతో సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ఐపీఎల్లో రాహుల్‌కు ఇది మూడో సెంచరీ కాగా.. కెప్టెన్‌గా రెండోది. అలాగే ఐపీఎల్లో అత్యధిక సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు.
4/ 8
5 సెంచరీలతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. సంజూ శాంసన్ కూడా 3 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
5/ 8
ఇక, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అంటే చాలు కేఎల్ రాహుల్ శివతాండవం ఆడేస్తాడు. ఈ జట్టుపై సూపర్ రికార్డులు ఉన్న కేఎల్ రాహుల్ ఈ సెంచరీతో ఆ రికార్డులను మరింత మెరుగుపరచుకున్నాడు.
6/ 8
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌తో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 76 సగటుతో 764 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 132గా ఉంది. ఇందులో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 103 పరుగులు నాటౌట్‌గా ఉంది.
7/ 8
ఐపీఎల్లో ఇప్పటివరకు 100 మ్యాచ్‌లాడిన కేఎల్ రాహుల్ 47 సగటుతో 3508 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 132 పరుగులుగా ఉంది.
8/ 8
ఇక, ముంబైతో జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగులతో విజయాన్ని అందుకుంది. 200 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.