ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలో అసలేం జరిగింది, అంపైర్ నిర్ణయంపై పంత్ ఆగ్రహం, డేవిడ్ వార్నర్, శార్దుల్ ఠాకూర్, షేన్ వాట్సన్, సంజూ సామ్సన్, రోహిత్ శర్మ" width="1600" height="1600" /> దాదాపు 24 ఏళ్ల పాటు క్రికెట్ ను ఏలిన రారాజు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar). సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యి ఇప్పటికే దాదాపు దశాబ్దం కావొస్తుంది. అయినా అతని వారసుడి ఉనికి క్రికెట్ లో అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) వయసు 22 ఏళ్లు. అయినా కూడా ఇప్పటికీ అటు రంజీల్లోనూ ఇటు ఐపీఎల్ లోనూ అరంగేట్రం చేయలేకపోయాడు.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ కోసం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)) రూ. 30 లక్షలు వెచ్చించి అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్ లో ముంబై ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఆడిన 9 మ్యాచ్ ల్లో ఎనిమిదింటిలో ఓడి కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచి పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లతో చిట్ట చివరి స్థానంలో ఉంది.
కేరళ బ్లాస్టర్స్, సచిన్ స్థానంలో మోహన్‌లాల్, sachin son, arjun tendulkar, arjun tendulkar 5 wickets, mumbai team, mumbai beat gujarat, vinoo mankad trophy, అర్జున్ టెండుల్కర్, సచిన్ కొడుకు, సారా టెండుల్కర్, సారా హాట్" width="759" height="506" /> తాజాగా ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గురువారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో జయవర్దనే పాల్గొనగా.. అర్జున్ అరంగేట్రంపై రిపోర్టర్లు ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా ’అర్జున్ ఎంట్రీ జట్టు కూర్పుపై ఆధారపడి ఉంటుందంటూ పేర్కొన్నాడు. అదే విధంగా ఎవరిని ఆడిస్తే జట్టు విజయావకాశాలు ఉంటాయని ఆలోచించిన తర్వాతే తుది జట్టును ఎంపిక చేస్తామని జయవర్ధనే పేర్కొన్నారు. దీన్ని బట్టీ అర్జున్ ఐపీఎల్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే.