ఐపీఎల్(IPL).. ఈ క్యాష్ రిచ్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్స్ లో ఐపీఎల్ కున్నా క్రేజే సపరేటు. ఈ లీగ్ ద్వారా ఆటగాళ్లతో పాటు బీసీసీఐకి కూడా కాసుల పంట పండుతూనే ఉంది. ప్రతి ఏటా ఐపీఎల్ కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 8 జట్లతో జరిగిన లీగ్.. వచ్చే ఏడాది నుంచి 10 జట్లతో జరగనుంది. దీంతో ఐపీఎల్ మరిన్ని మ్యాచులతో అభిమానులను అలరించనుంది. మరోవైపు, వచ్చే ఏడాది మెగా ఆక్షన్ పై జరగనుండటంతో పలువురు భారత యంగ్ క్రికెటర్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కన్నేశాయ్. ఆ క్రికెటర్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
వెంకటేశ్ అయ్యర్ : ఐపీఎల్ 2021 ద్వారా టీమిండియాకు లభించిన మరో ఆణిముత్యం వెంకటేశ్ అయ్యర్. ఈ సీజన్ లో వెంకటేశ్ అయ్యర్ మెరుపులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్ 2021 సీజన్ లో 10 మ్యాచ్ లాడిన వెంకటేశ్ అయ్యర్ 370 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. అంతేకాకుండా.. బౌలింగ్ లోనూ కూడా సత్తా చాటగలడు. దీంతో ఈ యంగ్ క్రికెటర్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ అవుతున్నాయ్ ఐపీఎల్ ప్రాంచైజీలు.
రాహుల్ త్రిపాఠి : ఈ యంగ్ క్రికెటర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. తన క్లాసిక్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు ఈ యంగ్ గన్. అగ్రెసివ్ గా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లడంలో దిట్ట. ఐపీఎల్ 2021 సీజన్ లో కోల్ కతాను ఫైనల్ కి చేర్చడంలో ఈ ఆటగాడు కీ రోల్ ప్లే చేశాడు. 2021 సీజన్ లో 16 మ్యాచులాడిన రాహుల్ త్రిపాఠి 397 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 140కు పైగానే ఉంది. ఇలాంటి నమ్మకం గల ప్లేయర్ కోసం ఐపీఎల్ ప్రాంచైజీలు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు.
దేవదత్ పడిక్కల్ : గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఈ యంగ్ ఓపెనర్ అదరగొట్టాడు. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి ఆటగాళ్లుని మించి ఈ రెండు సీజన్లలో ఆడాటంటే దేవదత్ పడిక్కల్ ఎటువంటి ఆటగాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఐపీఎల్ లో 14 మ్యాచులాడిన దేవదత్ 411 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉంది. భవిష్యత్తు టీమిండియా సూపర్ స్టార్ అని ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఇతన్ని కొనియాడుతున్నారు.
అర్షదీప్ సింగ్ : ఈ ఏడాది ఐపీఎల్ లో తన అద్భుతమైన బంతులతో బడాబడా ప్లేయర్లను కూడా బోల్తా కొట్టించాడు అర్షదీప్ సింగ్. ఈ యంగ్ పేసర్ సూపర్ బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పర్ ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేయడంలో దిట్ట. ఈ ఐపీఎల్ సీజన్ లో 12 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. డెత్ బౌలింగ్ లోనూ అద్భుతంగా రాణిస్తాడు అర్ష్ దీప్ సింగ్. అందుకే ఈ క్రికెటర్ పై ఐపీఎల్ ప్రాంచైజీలు కన్నేశాయ్.
హర్షల్ పటేల్ : ఐపీఎల్ 2021 లో ది బెస్ట్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు హర్షల్ పటేల్. ఈ ఏడాది ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ హర్షల్ పటేల్ నే. ఈ యంగ్ బౌలర్ 32 వికెట్లు తీసి లెజండరీ క్రికెటర్ల చేత కూడా ప్రశంసలు దక్కించుకున్నాడు. అందుకే.. టీమిండియా న్యూజిలాండ్ సిరీస్ లో చోటు సంపాదించుకున్నాడు. అందుకే.. హర్షల్ పటేల్ కన్నేశాయ్ ఐపీఎల్ ప్రాంచైజీలు.
పృథ్వీ షా : దూకుడైన ఆటకు పెట్టింది పేరు పృథ్వీ షా. ఓ వైపు దూకుడుగానే ఆడుతూ.. జట్టుకు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందిస్తాడు ఈ యంగ్ ఓపెనర్. ఆడిన 15 మ్యాచుల్లో 479 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. ఈ సీజన్ లో స్ట్రైక్ రేట్ 159.13. పవర్ ప్లే ఓవర్లలో పృథ్వీ షా దూకుడుని ప్రత్యర్ధుల బౌలర్లు వణికారు. అందుకే.. ఈ డైనమైట్ బ్యాటర్ పై ఐపీఎల్ ప్రాంచైజీలు కన్నేశాయ్.
యశస్వి జైస్వాల్ : అండర్ -19 క్రికెట్ నుంచి వచ్చిన అద్భుత ప్లేయర్ యశస్వి జైస్వాల్. ఈ ఐపీఎల్ లో రాజస్తాన్ కు మంచి స్టార్ట్ లు అందించడంలో ముందున్నాడు యశస్వి జై స్వాల్. 10 మ్యాచులాడిన జైస్వాల్ 249 పరుగులు చేశాడు. ఇందులో ధనాధన్ హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఈ యంగ్ క్రికెటర్ పై అందుకే ఐపీఎల్ జట్లు కన్నేశాయ్