ఐపీఎల్ రెండు కొత్త జట్లను కొనేందుకు భారతదేశంతో పాటు విదేశాలలో కూడా చాలా ఆసక్తి ఉంది. అయితే కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీలను చేజిక్కించుకోవడానికి భారత్ లోని బడా కార్పొరేట్ సంస్థలే కాదు.. ఏకంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పోర్ట్స్ క్లబ్ గా పేరున్న మాంచెస్టర్ యూనైటెడ్ (Manchester United) కూడా బిడ్ దాఖలు చేసినట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మాంచెస్టర్ యునైటెడ్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ, ఖరీదైన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్‌కు అభిమానులు ఉన్నారు. క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం ఈ జట్టు కోసం ఆడుతున్నాడు. ఈ జట్టు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఆఫ్ ఇంగ్లండ్‌లో భాగంగా ఉంది. చాలా మంది భారత క్రికెటర్లు కూడా మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు అభిమానులు.